javascript:void(0)

Breaking News

ఉరవకొండలో చేనేతలకు చేనేత జాకార్డ్ పంపిణీ

ఉరవకొండ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ చేనేత అభివృద్ధి ప్రోగ్రామ్ ద్వారా 


 ఉరవకొండ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ చేనేత అభివృద్ధి ప్రోగ్రామ్ ద్వారా ఉరవకొండ పారిశ్రామిక చేనేత క్లష్టర్ నందు దాదాపు 13 లక్షల రూపాయలు జాకార్డ్ చేనేత పనిముట్లును కేంద్ర ప్రభుత్వం 90% సబ్సిడీతో చేనేత కార్మికులకు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య పంపిణీ చేశారు.పట్టణంలోని చేనేత పారిశ్రామిక సహాకార సంఘం, చేనేత బ్లాక్ లెవెల్ క్లష్టర్ నందు ఆదివారం జాతీయ చేనేత అభివృద్ధి ప్రోగ్రాం చేనేత క్లష్టర్ చైర్మైన్ కొత్త శ్రీనివాసులు ఆధ్యక్షతన చేనేత పనిముట్లు పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ ,వీవర్స్ సెంటర్,విజయవాడ ఆధికారులు టిఎస్ఎన్ రెడ్డి, జాతీయ చేనేత క్లష్టర్ చైర్మన్ కొత్త శ్రీనివాసులు,చేనేత శాఖ జిల్లా ఆధికారి రామప్ప, డివో మహేశ్వర రెడ్డి, నోడల్ ఆఫీసర్ ADO శేషాగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

No comments