javascript:void(0)

Breaking News

ఉరవకొండ చేనేత క్లస్టర్ ను అడ్డుకుంటే సహించేది లేదు.....


🙏 అనంతపురం జిల్లా ఉరవకొండలో స్థానిక చేనేత నాయకుల కృషి ఫలితంగా ప్రభుత్వం చేనేత క్లస్టర్ మంజూరు చేసింది. ఈ క్లస్టర్ అమలులోకి వస్తే చేనేత వృత్తిపై ఆదారపడే నేతన్నలకు కాస్త మెరుగైన జీవితం ఉంటుంది. కానీ నేతన్నల బ్రతుకు దెరువుకు ఆసరాగా ఉండే ఈ చేనేత క్లస్టర్ ను ఉరవకొండలో ఏర్పాటు చెయ్యనియ్యకుండా కొంతమంది స్వార్థ నాయకులు, చేనేత వ్యతిరేకులు ప్రయత్నాలు చేస్తున్న విషయం సామాజిక మాద్యమాల ద్వారా వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ దృష్టికి వచ్చింది. ఈ చేనేత వ్యతిరేక విదానానికి స్వస్థి పలకాలని స్వార్థ నాయకులకు ఫ్రంట్ హెచ్చరికలు జారీచేస్తుంది. ఏ స్థాయి వ్యక్తులైనా ఉరవకొండలో చేనేత క్లస్టర్ ను ఏర్పాటు చెయ్యకుండా అడ్డంకులు సృష్ఠస్తే తగిన విదంగా వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ స్పందిస్తుందని ఇదే సామాజిక మాద్యమాల ద్వారా సంభందిత వ్యక్తులకు సమాచారం అందిస్తుంది. ఈ విషయమై త్వరలో ఫ్రంట్ రాష్ట్రస్థాయి ప్రతినిదులు ఉరవకొండలో పర్యటించి సమగ్ర విచారణ జరిపి ముఖ్యమంత్రి గారికి నివేదిక అందచేయనుంది.



No comments